శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (11:32 IST)

ఢిల్లీ డ్యాన్సర్‌పై గ్యాంగ్ రేప్...

ఓ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన డ్యాన్సర్‌పై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అదీకూడా పక్కా ప్లాన్‌తో ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని కజౌరీ ఖాస్ లో ఓ నృత్య కార్యక్రమం చేసేందుకు హర్యానాకు చెందిన 20 యేళ్ళ డ్యాన్సర్ అంగీకరించింది. బస్సులో ఆమె ఢిల్లీకి బయలుదేరగా, అప్పటికే, ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు తాము ఈవెంట్ వద్దకే వెళుతున్నామని, తీసుకెళతామని నమ్మబలికారు. 
 
వారి మాటలను ఆమె నమ్మగా, కాశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి, ఆపై బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సెల్ ఫోన్ తీసుకుని నిందితులు పారిపోయారు. ఆ తర్వాత అక్కడ నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అరెస్టు చేశారు.