డ్యాన్సర్‌పై గ్యాంగ్ రేప్.. కాశ్మీర్ గేట్ వద్ద దించారు.. నిర్మానుష్య ప్రాంతంలో?
దేశంలో మహిళలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలపై అకృత్యాలను అడ్డుకునేందుకు కఠినమైన చట్టాలు రావట్లేదు. ఈ నేపథ్యంలో ఓ డ్యాన్సర్‌పై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది.
ఓ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒప్పందం కుదుర్చుకుని, అక్కడికి వెళ్లేందుకు బస్సెక్కిన ఓ యువతిని, ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన హర్యానాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని కజౌరీ ఖాస్‌లో ఓ నృత్య కార్యక్రమం చేసేందుకు హర్యానాకు చెందిన డ్యాన్సర్ (20) అంగీకరించింది. బస్సులో ఆమె ఢిల్లీకి బయలుదేరగా, అప్పటికే ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు.. ఆమెను ఈవెంట్ వద్దకు తీసుకెళ్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిక డ్యాన్సర్ వారితో ప్రయాణమైంది.
కానీ ఈ దుండగులు కాశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి, ఆపై బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె సెల్ ఫోన్ తీసుకుని నిందితులు పారిపోగా, పోలీసు కేసు నమోదు చేశామని, నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.