శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (13:32 IST)

కరోనా కాలంలో రెచ్చిపోయిన కామాంధులు.. యువతిపై గ్యాంగ్ ‌రేప్

కరోనా కాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుండటమే అందుకు నిదర్శనం. తాజాగా ఒంటరిగా వున్న యువతిని లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన త్రిపురలోని కొవాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. పశువుల్లా మీద పడిన కామాంధులు.. అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఒకరి తర్వాత మరొకరు అకృత్యానికి ఒడిగట్టారు.
 
వివరాల్లోకి వెళితే.. ఖాసియమంగల్ ఏరియాకి చెందిన టీనేజ్ యువతి (17) ఒంటరిగా కనిపించడంతో కామాంధులు రెచ్చిపోయారు. ఆమెను అపహరించి బలవంతంగా అడవిలోకి లాక్కెళ్లి దారుణంగా సామూహిక అత్యాచారం చేశారు. ఆమెను రేప్ చేసిన ముగ్గురు యువకులు.. వారి స్నహితులను కూడా ఫోన్ చేసి రప్పించినట్లు తెలుస్తోంది. 
 
మరో ఇద్దరు కూడా ఆమెపై బలాత్కారం చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు పది మందిని అదుపులోకి తీసుకున్నారు. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఐదుగురితో పాటు వారికి సహకరించినందుకు మరో ఐదుగురిని అరెస్టు చేశారు.