శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఆగస్టు 2020 (10:53 IST)

ఇర్ఫాన్ ఖాన్‌కు ఆస్కార్ ఘన నివాళి.. కరోనా సంక్షోభంలో..?

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఏప్రిల్ 29 న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (ఆస్కార్) తమ ట్విట్టర్ ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. 
 
ఈ వీడియో చివరలో ఇర్ఫాన్ క్లిప్ అందరిని ఆకర్షించింది. కరోనా సంక్షోభంలో ప్రజలని ఉత్తేజపరిచిన సినిమాలకి సంబంధించిన కొన్ని క్లిప్స్‌ని వీడియోగా మార్చి అకాడమీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 
 
ఇందులో హర్, సెంట్ ఆఫ్ ఎ ఉమెన్, షావ్‌శాంక్ రిడంప్షన్, ది డార్క్ నైట్, ఇంటర్‌స్టెల్లార్, పారాసైట్ ఇలా ఐకానిక్ ఆస్కార్ నామినేటెడ్ చలనచిత్రాల నుండి స్పూర్తినిచ్చే డైలాగులు, సీన్స్ వీడియోలో ఉన్నాయి. ఇందులో ఇర్ఫాన్ క్లిప్ అందరి దృష్టిని ఆకర్షించింది.