శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (18:27 IST)

అక్రమ సంబంధం పెట్టుకుందనీ... భర్తను భార్య భుజాలపై ఎక్కించి ఊరేగించారు.. ఎక్కడ?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ఓ మహిళ పరాయి వ్యక్తితో అక్రమం సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త.. కుటుంబ సభ్యులతో పాటు... గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. అంతే... వారంతా కలిసి పంచాయతీ పెట్టారు. తర్వాత భార్య భుజాలపైకి భర్తను ఎక్కించి.. ఊరంతా ఊరేగించారు. భర్త బరువు మోయలేక ఓ చోట నిల్చుంటే ఆ మహిళను ముగ్గురు వ్యక్తులు కర్రలతో చావబాదారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ అమానవీయ ఘటన వివరాలను పరిశీలిస్తే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలోని ఓ గిరిజ‌న గ్రామానికి చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల క్రితం గుజ‌రాత్‌కు వ‌ల‌స వెళ్లింది. ఈ క్రమంలో లాక్డౌన్ కారణంగా ఇటీవలే తమ సొంతూరుకు తిరిగి వచ్చింది. 
 
అక్కడ భార్యాభర్తలిద్దరూ కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే త‌న భార్య మ‌రొక వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం కొన‌సాగిస్తుంద‌ని భ‌ర్త కుటుంబ స‌భ్యుల‌కు, గ్రామ‌స్తుల‌కు చెప్పాడు. దీంతో ఆమెకు శిక్ష విధించారు. 
 
భ‌ర్త‌ను త‌న భుజాల‌పై కూర్చోబెట్టి ఊరేగించారు. ఆమె న‌డ‌వ‌లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. భ‌ర్త బ‌రువును మోయ‌లేక ఒక చోట నిల్చుంటే.. క‌ర్ర‌ల‌తో ఓ ముగ్గురు వ్య‌క్తులు ఆమెను చిత‌క‌బాదారు. 
 
ఈ త‌తంగాన్ని స్థానికులు త‌మ మొబైల్స్‌లో చిత్రీక‌రించారు. కానీ ఆ ఘ‌ట‌న‌ను అడ్డుకోలేక‌పోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు.. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.