ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జులై 2020 (19:32 IST)

ఏం బతుకో... ఏమో... భయంభయంగా బతకాల్సి వస్తోంది (Video)

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కరోనా వైరస్ మహమ్మారిపై స్పందించారు. ఏం బతుకో ఏమో... భయం భయంగా జీవించాల్సి వస్తోంది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచం మొత్తం కష్టాల్లోకి జారుకుందని, ఈ కరోనా మనకు ఎన్నో పాఠాలను నేర్పిందని వ్యాఖ్యానించింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 2020 సంవత్సరమంతా ఇబ్బందులతోనే కొనసాగుతోందని... ప్రతి రోజు భయాందోళనలతోనే బతకాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ప్రతి ఒక్కరం స్వీయ రక్షణను, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ కరోనాను ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామని సూచించింది. రానున్న రోజుల్లో మరిన్ని విపత్తులు, రోగాలు, యుద్దాలను ప్రపంచం ఎదుర్కోవాల్సి ఉంటుందని రకుల్ జోస్యం చెప్పింది. 
 
ఎలాంటి ఆపదలు మన దరికి చేరవనే నమ్మకంతో జీవిద్దామని తెలిపింది. మనం ఇంకా జీవించి ఉన్నందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుందామని చెప్పింది. ఇంటి వద్దనే ఉంటూ కరోనా విస్తరణను నియంత్రిద్దామని సూచించింది.
 
కరోనా కారణంగా రకుల్ ఇంటికే పరిమితమైంది. ఇటీవలనే ఆమె హైదరాబాద్ చేరుకుంది. అయితే, ఇంకా షూటింగులు ప్రారంభం కాకపోవడంతో... ఆమె ఖాళీగానే ఉంది. అయితే, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది.