శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 29 జులై 2020 (23:24 IST)

కరోనావైరస్ కాలం, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఈ టీతో తగ్గుతాయి

జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బాగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తీసుకుంటే ఫలితం వుంటుంది. ఐతే సమస్య వుంది కదా అని అల్లం టీని అదే పనిగా తాగరాదు. రోజులో నాలుగుసార్లకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.
 
ఆస్తమా, దగ్గులను తగ్గించాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. నీరసంగా ఉన్నవారు అల్లం టీ త్రాగటం వల్ల ఉత్సాహం వస్తుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు. అంతేకాదు ఏ అనారోగ్యంతో బాధపడేవారైనా అల్లం టీని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.