మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: బుధవారం, 29 జులై 2020 (16:43 IST)

కరోనావైరస్‌కు తోడైన మిత్రపక్ష వ్యాధులు, ఏమిటో తెలుసా?

ఒక ప్రక్క కరోనా అందర్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనికితోడు మరో ప్రక్క సీజనల్ వ్యాధులు కూడా మానవాళిని వెంటాడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ డేంజర్ బెల్ మోగిస్తుంటే, మరోప్రక్క విష జ్వరాలు పంజా విసురుతున్నాయి.
 
దీంతో జనం భయంతో కృంగిపోతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు ప్రస్తుతం తాండవమాడుతున్నాయి. కరోనాకు తోడుగా డెంగీ, టైఫాయిడ్, చికెన్ గున్యా, మలేరియా వంటి వ్యాధులతో జనాలు మంచాన పడుతున్నారు.
 
ఒక్క నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 23 డెంగీ కేసులు నమోదు కాగా ఓ చికెన్ గున్యా కేసు కూడా నమోదైంది. ఇక మలేరియా, టైపాయిడ్ వంటి జ్వరాలు వస్తుండటంతో జనాలు హాస్పిటల్లో క్యూ కడుతున్నారు.