మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (16:22 IST)

హోమియోపతి.. ఆయుర్వేదంతోనే కరోనాను జయించాం.. విశాల్ (video)

హీరో విశాల్, తన తండ్రి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో విశాల్ వారం రోజుల్లో కరోనాను ఎలా జయించారో వివరించారు. మా అంకుల్‌ డాక్టర్ హరిశంకర్ గారి సమక్షంలో మేము ఆయుర్వేదిక్‌, హోమియోపతి మెడిసిన్ తీసుకున్నామని వివరించారు.

దీనికోసం తాము ఆయుర్వేదిక్‌, హోమియోపతి మెడిసిన్‌ను ప్రమోట్ చేయడంలేదు. కేవలం ఆ మెడిసిన్ ద్వారా తండ్రితో పాటు తాను కూడా కోవిడ్ లాంటి మహమ్మారి నుంచి కోలుకున్నామని చెప్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి ఎలా కోలుకున్నామో అందరికీ చెప్పాలనేదే తన కోరిక అని కరోనాకు ఆయుర్వేదిక్, హోమియోపతి బాగా పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విశాల్ ఒక వీడియో విడుదల చేశారు.
 
ఈ వీడియోలో విశాల్ మాట్లాడుతూ.. ''నాన్న గారికి జూన్‌లో కరోనా పాజిటీవ్ వచ్చిందని ఈ మధ్య కాలంలో ఒక వీడియో పెట్టాను. మా నాన్న గారికి 82 సంవత్సరాలు. ఈ వయసుతో ఆయనను హాస్పటల్లో అడ్మిట్‌ చేయాలనే ఆలోచన అస్సలు లేదు. ఇంట్లోనే ఉంచి ఆయనను బాగా చూసుకోవాలనేదే నా కోరిక. అందుకే నేనే దగ్గరుండి ఆయనను చూసుకున్నాను. ఆ క్రమంలో నాకు అవే లక్షణాలు నాకు కనిపించాయి. దాంతో టెస్ట్ చేయించుకుంటే నాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. నాతో పాటు నాకు దగ్గరగా ఉండే మా మేనేజర్‌కి కూడా పాజిటీవ్ వచ్చింది..'' అంటూ చెప్పుకొచ్చాడు. 
 
అయితే క్రమ పద్దతిలో మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో శరీర ఉష్ణోగ్రత, లక్షణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాడు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండటంతో పాటు మందులు కూడా వాడటం వల్ల  వారం రోజుల్లోనే ఆరోగ్యంగా మారిపోయామని పేర్కొన్నాడు.

ఆరోగ్యం కుదుటపడేందుకు ఉపయోగిస్తున్న మెడిసిన్‌ను సైతం ట్విటర్‌లో పంచుకున్నాడు. అయితే ప్రతి ఒకరూ తమ ఫ్యామిలీ డాక్టర్‌ను కలిసి ఈ మెడిసన్‌ను వాడాలని విశాల్‌ సూచించాడు. తాజాగా ఇది చూసిన అభిమానులు నువ్వు రియల్ హీరో అంటూ విశాల్‌ను పొగిడేస్తున్నారు.