శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (18:15 IST)

జ్వరం వస్తే కరోనా వైరస్ సోకినట్టేనా? (Video)

ఇపుడు చాలా మందికి జ్వరం వస్తే చాలు కరోనా వైరస్ సోకిందనే భయంతో వణికిపోతున్నారు. నిజానికి సీజనల్ జ్వరం వచ్చినా తనకు కరోనా సోకిందని ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఇపుడు ఎక్కడికి వెళ్లాలన్నా ముందుగా పరీక్ష చేస్తున్నారు. ఆ తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. 
 
ముఖ్యంగా ఆస్పత్రులు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు ఇలా ప్రతి ఒక్కచోటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా థర్మల్ మీటరుతో తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాతే లోనికి పంపిస్తున్నారు. 
 
అందులో గ‌నుక కాస్త తుమ్మిగా, ద‌గ్గిన‌, జ్వ‌రం, ముక్కు తుడుచుకున్న వంటి ల‌క్ష‌ణాలు ఏవి క‌నిపించినా డైర‌క్టుగా క్వారెంటైన్ సెంట‌ర్ల‌కు పంపిస్తున్నారు. దీనిపై ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో కొన్ని ముఖ్య‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.
 
 
సాధార‌ణంగా ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి క‌రోనా ఉంద‌ని చెప్పేవాళ్లు. ఇప్పుడు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా క‌రోనా పాజిటివ్ వ‌స్తుంది. చాప కింద నీరులా శ‌రీరంలోకి పాకుతున్న‌ది. ఇటీవ‌ల ఎయిమ్స్‌లో 144 మంది ట్రీట్‌మెంట్ కోసం చేరారు. వారిలో వైర‌ల్ ల‌క్ష‌ణాల‌ను ప‌రిశీలించ‌గా 17 శాతం మందికే జ్వ‌రం వ‌చ్చింది తేలింది. 
 
మిగిలిన వారికి శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు, గొంతు నొప్పి, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌ని పేర్కొన్న‌ది. కాబ‌ట్టి థెర్మో టెస్టులతో శ‌రీర ఉష్టోగ్ర‌త‌ను ప‌రిశీలించ‌డం ద్వారా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ లోపల వైర‌స్ ఉంటుంది కాబ‌ట్టి బ‌య‌ట‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.