మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 జులై 2020 (09:36 IST)

ఆ క్రికెటర్‌కు కరోనా పాజిటివ్ అయినా.. అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు..

Haris Rauf
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన పాకిస్థాన్ ఆటగాళ్లకు పీసీబీ కరోనా వైరస్ పరీక్షలు చేసింది. అయితే అందులో ఏకంగా 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో ఫాస్ట్ బౌలర్ హారీస్ రౌఫ్‌ కూడా ఒక్కడు. అయితే అతను ఇంకా ఈ వైరస్ బారినుండి బయటపడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానితో ఆయన తీసుకున్న ఫోటో చర్చనీయాంశమైంది. 
 
కాగా.. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరిస్ రౌఫ్‌తో కలిసి తీసుకున్న ఓ సెల్ఫీని అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అందులో హరిస్ మాస్క్ లేకుండానే ఉన్నాడు. అయితే ఈ ఫోటోను షేర్ చేస్తూ ఆ అభిమాని ఓ విషయాన్ని తెలిపాడు. 
 
అదేంటంటే... ''నేను ఈ రోజు హరిస్ రౌఫ్‌‌ను కలిసాను. అలాగే అతనితో ఓ సెల్ఫీ తీసుకున్నాను. ఆ తర్వాత అతను ఇంగ్లాండ్ పర్యటన కోసం పాక్ జట్టుకు ఎందుకు సెలెక్ట్ కాలేదు అని ఆన్‌లైన్ లో వెతికాను. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే... అతనికి కరోనా పాజిటివ్ అని దానికి అతని ఇంకా చికిత్స తీసుకుంటున్నాడు అని తెలిసింది'' అంటూ వివరించాడు.