శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జులై 2020 (23:31 IST)

యువతలో సెల్ఫీ పిచ్చి.. నదీ మధ్యలో ఫోజిచ్చిన అమ్మాయిలు.. చివరికి?

Selfie
యువతలో సెల్ఫీ పిచ్చి మామూలుగా లేదు. కరోనా వచ్చినా.. ఎక్కడా తిరగొద్దని విన్నా ఓ యువత బృందం పిక్నిక్‌కు వెళ్లింది. అంతటితో ఆగకుండా.. సెల్ఫీలు తీసుకున్నారు. అదీ ఎక్కడ అంటే.. నదిలో. ఆ సెల్ఫీ పిచ్చి కాస్త ప్రాణాల వరకు తెచ్చింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో గల పెంచ్ నదిలో ఈ సంఘటన జరిగింది. 
 
సెల్ఫీ పిచ్చి బాగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు నదిలోకి దికి ఫోజులు పెట్టడం ప్రారంభించారు. అంతలోనే వరద పోటెత్తడంతో వాళ్లిద్దరూ చిక్కుకుపోయారు. దాదాపు ప్రాణాపాయం నుంచి వాళ్లను అతి కష్టం మీదగానీ పోలీసులు కాపాడారు. 
 
ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ అమ్మాయిలంతా నదికి సమీపంగా ఉండే బేలాఖేడికి చెందినవాళ్లుగా పోలీసులు గుర్తించారు. నదిలోని రాళ్లపై నిలబడి సెల్ఫీలు దిగుతుండగా, వరద పోటెత్తి వాళ్లు చిక్కుపోవడంతో బయటున్న స్నేహితురాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
వెంటనే స్పందించిన పోలీసులు.. గజ ఈతగాళ్లతో సహా పెంచ్ నది వద్దకు చేరుకున్నారు. తాడు సాయంతో అతికష్టం మీద యువతులిద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. టెన్షన్ తీరిన తర్వాత అమ్మాయిలందరూ పోలీసులకు థ్యాంక్స్ చెప్పగా, ఇంకోసారి ఇలాంటి దుస్సాహసాలు చేయొద్దని పోలీసులు హితవు చెప్పి వాళ్లను పంపించేశారు.