శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (16:20 IST)

ఉత్తరాదిన విజృంభిస్తోన్న కరోనా.. మధ్యప్రదేశ్, ఒడిశాల్లో పెరిగిపోతున్న కేసులు

మధ్యప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సబ్‌ జైలులో ఒకే రోజు భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రైసెన్‌ జిల్లాలోని బరేలి సబ్‌ జైలులో సోమవారం 67 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 64 మంది జైలు ఖైదీలు, ముగ్గురు హోంగార్డులకు వైరస్‌ సోకింది.
 
ఈ నేపథ్యంలో కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన 22 మంది ఖైదీలు, సిబ్బందిని పొరుగున ఉన్న విదిషా జిల్లాలోని మెడికల్‌ కళాశాలకు తరలిస్తున్నామని మధ్యప్రదేశ్‌ జైళ్ల డీజీ సంజయ్‌ చౌదరి తెలిపారు. మిగతా వారిని బరేలి జైలులో ఉంచి వైద్య సేవలందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, 82 మంది ఖైదీలున్న జైలులో 67 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కొత్తగా చేరిన ఖైదీల కారణంగా వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు భావిస్తున్నారు.
 
అలాగే ఒడిశాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. తాజాగా మంగళవారం 647 కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారినపడి 457 మంది కొలుకొని డిశ్చార్జి అయ్యారని ఆ రాష్ట్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 103 మంది మృతి చెందారు.