గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 29 జులై 2020 (22:19 IST)

ఎస్ఎస్ రాజమౌళికి కరోనావైరస్ పాజిటివ్, ప్లాస్మా దానం చేస్తానన్న జక్కన్న

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తను కరోనావైరస్ బారిన పడినట్లు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. కొద్ది రోజుల క్రిత జ్వరం వచ్చిందనీ, దాంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలిందని ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశారు. ట్విట్టర్లో ఈ వార్త చూసిన వెంటనే జక్కన్న త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్లు చేస్తున్నారు.
 
తన కుటుంబ సభ్యులు, తను కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నామని వెల్లడించారు. జ్వరం తగ్గింది కానీ ఎందుకైనా మంచిదని రోగ నిర్ధారణ పరీక్షలు చేయించినట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని పేర్కొన్నారు.
 
కరోనావైరస్ పాజిటివ్ అని తేలడంతో తనతో పాటు కుటుంబ సభ్యులందరూ హోంక్వారైంటైన్లు వున్నట్లు తెలియజేశారు. వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సంపూర్ణ ఆరోగ్యవంతులమయ్యాక ప్లాస్మా దానం చేస్తామని రాజమౌళి వెల్లడించారు.