1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Two Storms to hit Chennai City

మొన్న ముంబై నిన్న హైదరాబాద్ ఇపుడు చెన్నై.. ఈ వారంలోనే రెండు తుఫాన్లు!

ఈ యేడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటికిమొన్న ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశారు. అలాగే, నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. ఇక చెన్నై నగరం వంతు రానుంది. వరుసగా ర

Chennai City
ఈ యేడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటికిమొన్న ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశారు. అలాగే, నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. ఇక చెన్నై నగరం వంతు రానుంది. వరుసగా రెండు తుఫాను చెన్నై నగరాన్ని తాకనున్నాయట. 
 
సాధారణంగా నవంబర్ - డిసెంబర్‌ నెలలు వచ్చాయంటేనే నగర ప్రజలు ఉలిక్కిపడతారు. ఇక వరుసగా రెండు తుఫాన్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు విరుచుకుపడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో నగరం సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఈ నెల 7న ఓ వాయుగుండం తుఫానుగా మారి 11న చెన్నై తీరాన్ని తాకుతుందని తెలిపింది. 
 
ఆ తర్వాత 12న మరో వాయుగుండం తుఫానుగా మారి 15 నుంచి 20వ తేదీలోపున చెన్నై తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఈ నెల 11లోపున తీరం దాటే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. 
 
ఈ రెండు తుపాన్లు కడలూరు - నెల్లూరు మధ్య తీరం దాటడం ఖాయమని అంటున్నారు. ఈ రెండు తుఫానుల వల్ల ఈశాన్య రుతుపవనాలు తోడై మామాలు స్థాయికన్నా 111 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నిజం మాట్లాడితే "యాంటీ మోడీ" అనేస్తారా? ప్రకాశ్ రాజ్ ప్రశ్న.. కేసు నమోదు