బుధవారం, 18 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

04-01-2020 శనివారం మీ రాశిఫలాలు - రమాసమేత స్వామిని ఆరాధించినా...

మేషం : భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. మీ గౌరవమర్యాదలకు భంగం కలుగకుండా చూసుకోవాలి. మీ కృషికి తగిన ప్రతిఫలం ఆలస్యంగా అందుతుంది. సభ్యత్వాలు, పదవుల నుంచి తప్పుకోవలసి వస్తుంది. ప్రయాణాలు చికాకు పరుస్తాయి. చీటికి మాటికి ధనం విపరీతంగా ఖర్చు చేస్తారు. 
 
వృషభం : పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు భిన్నంగా ఉంటాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు అనుకూలం. గత తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలి. 
 
మిథునం : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు ద్వితీయభాగం నుంచి సంతృప్తి, అభివృద్ధి కానరాగలదు. గృహంలో ఏదైనా వస్తువులు పోయే ఆస్కారం ఉంది. జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. మీ అవసరాలకు ధనం సర్దుబాటు కాగలదు. కుటుంబీకుల మధ్య దూరపు బంధువుల ప్రస్తావన వస్తుంది. 
 
కర్కాటకం : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి కొద్దిపాటి లాభాలు గడిస్తారు. దైవ, సేవ పుణ్య కార్యాల పట్ల ఆసక్తి కలుగుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడుతారు. 
 
సింహం : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు వాయిదాపడతాయి. కోళ్ళ, మత్స్యు, గొర్రెల వ్యాపారస్తులకు వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. అసంపూర్తిగా వదిలేసిన పనులు పూర్తి చేస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ, ఏకాగ్రత చాలా అవసరం. సేల్స్ సిబ్బందికి ధన, వస్తు ప్రతిఫలం అందిస్తారు. 
 
కన్య : పండ్లు, పూల, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారస్తులకు శుభదాయకంగా ఉంటుంది. పెద్దలు ఆత్మీయులు గురించి అప్రియమైన వార్తలు వినవలసి ఉంటుంది. ఆశాదృక్పథంలో కొత్త యత్నాలు సాగిస్తారు. రాజకీయ నాయకులకు కొంతమంది మీ పరపతిని దుర్వినియోగం చేస్తారు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
తుల : మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు స్వల్ప ఆటుపోట్లు తప్పవు. పత్రికా ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా అవసరం. కమ్యూనికేషన్, టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాల్లో వారికి పనివారితో సమస్యలు తలెత్తుతాయి. ఏదైనా అమ్మాలనే ఆలోచన క్రియారూపంలో పెట్టండి. 
 
వృశ్చికం : స్కీంలు, వాయిదాల పద్దతిలో విలువైన వస్తువులు అమర్చుకుంటారు. విదేశాల నుంచి ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. తరచూ సభలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాలకు కావలసిన అనుమతులు మంజూరవుతాయి. రాజకీయ నాయకులకు ఎదుటివారిని గమనించి ఎత్తుకు పైఎత్తు వేసి ముందుకు సాగండి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి, విశ్రాంతి లభిస్తాయి. మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వండి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయ సందర్శనాలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
మకరం : మీ శ్రీమతి సలహా ప్రకారం నడుచుకోవడం ఉత్తమం. సంతానం చదువుల నిమిత్తం భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. పెద్ద మొత్తంలో ఇతరులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన మంచిది. సోదరీసోదరుల మధ్య ఆస్తి వ్యవహారాల ప్రస్తావన వస్తుంది. 
 
కుంభం : మిమ్మలను ఉద్రేకపరిచి ఆనందించాలని కొంతమంది యత్నిస్తారు. వ్యవహార దక్షతతో సమస్య పరిష్కరిస్తారు. స్వార్థపూరిత ప్రయోజనాలు ఆశించి మీకు చేరువవ్వాలని భావిస్తున్న వారిని దూరంగా ఉంచండి. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయం అని గమనించండి. అయినవారి రాక సంతోషం కలిగిస్తుంది. 
 
మీనం : అధికారుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. విద్యార్థులు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. స్థిరాస్తి మూలక ధనం అందుతుంది. ఇతరుల తప్పిదాలకు సైతం మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. హామీలు, సంతకాలు చెల్లింపుల్లో తొందరపడొద్దు. దైవ, సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.