సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

30-12-2019 సోమవారం రాశిఫలాలు - బంధువుల రాకతో ధనం...

మేషం : సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. బంధువుల రాకతో ధనం అధికంగా వ్యయం చేస్తారు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. స్త్రీలు, మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
వృషభం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాలవారికి ప్రశాంతత చేకూరుతుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. మత్స్యు, కోళ్ల గొర్రెల వ్యాపారస్తులకు కలిసిరాగలదు. 
 
మిథునం : నిరుద్యోగులకు వచ్చిన అవకాశం చిన్నదైనా సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. బ్యాంకు వ్యవహారాలలో పరిచయంలేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 
 
కర్కాటకం : పత్రిక, వార్తా సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల, కూరగాయల వ్యాపారులు లాభసాటిగాసాగుతాయి. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
సింహం : కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. వృత్తి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు తప్పవు. విందుల్లో పరిమితి చాలా అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాలవారు అచ్చుతప్పులు పడుటవల్ల మాటపడక తప్పదు. 
 
కన్య : కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఫ్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. సోదరీ, సోదరుల మధ్య పరస్పర అవగాహన లోపం వంటివి ఉండగలవు. 
 
తుల : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారస్తులకు గణనీయమైన అభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. 
 
వృశ్చిక : వ్యవసాయ, తోటల రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. రావలసిన ధనం అందటంతో తనాఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు పనివారితో చిన్నచిన్న సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. 
 
ధనస్సు : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మకరం : బ్యాంకు వ్యవహరాలలో ఒడిదుడుకలను ఎదుర్కొంటారు. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. కళత్ర వైఖరి చికాకు కలిగిస్తుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు, క్రీడలు, పోటీల్లో రాణిస్తారు. రాబడికి తగినట్టుగా ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల ఏకాగ్రత అవసరం. 
 
కుంభం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. డాక్టర్లు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ప్రముఖుల కలయిక సాధ్యంకాదు. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. 
 
మీనం : శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మిమ్మల్ని పొగిడేవారేకానీ, సహకరించేవారు ఉండరు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.