సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

మంగళవారం రాశిఫలాలు - ఆ స్వామిని పూజించినా మీ మనోవాంఛలు నేరవేరుతాయి...

మేషం : ప్రైవేట్ ఫైనాన్సుల్లో మదుపు క్షేమంకాదు. పాత మొండిబాకీలు వసూలవుతాయి. స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. 
 
వృషభం : పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ప్రయాణాలలో వస్తువులు పోయే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు అధికారులతో మితంగా సంభాషించడం మంచిది. వైద్యుల ఆపరేషన్లలో విజయాన్ని  సాధిస్తారు. స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. 
 
మిథునం : ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. హామీలు, బ్యాంకు పనుల్లో ఏకాగ్రత వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలు టీవీ కార్యక్రమాలు, కళాత్మక పోటీల్లో రాణిస్తారు. నిరుద్యోగులు బద్ధకాన్ని వదిలి చురుగ్గా ఉండండి. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కర్కాటకం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయక సత్‌కాలంను సద్వినియోగం చేసుకోండి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాలలో భంగపాటు తప్పదు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి గుర్తింపు పొందుతారు. సోదరీ, సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. 
 
సింహం : ప్రముఖుల సహకారంతో కొన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం కాగలవు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. వైద్య రంగాల వారికి ఏకాగ్రత చాలా అవసరం. 
 
కన్య : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. వైద్యకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించండి. వృధా ఖర్చులు అదుపుచేయాలన్న మీ యత్నం నెరవేరదు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి తప్పదు. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 
 
తుల : ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. స్థిరాస్తని అమర్చుకోవాలనే కోరిక నెరవేరుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చిఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మొహమ్మాటాలు, ఒత్తిడి వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. 
 
వృశ్చికం : వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం విరమించుకోవడం శ్రేయస్కరం. సభలు, సమావేశాలలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వెచ్చిస్తారు. స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. 
 
ధనస్సు : రేషన్ డీలర్లు, ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అధికారుల వేధింపులు అధికం. రాజకీయాలలో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికం అవుతుంది. 
 
మకరం : ఆర్థిక, కుటుంబ సమస్యలు క్రమంగా సర్దుకుంటాయి. మొండిబాకీల వసూలుకు ఒకటికి రెండుసార్లు తిరగవలసి ఉంటుంది. మీ శ్రీమతి కోరికలు, అవసరాలు తీర్చగలుగుతారు. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. 
 
కుంభం : వస్త్ర వ్యాపారాలు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రముఖులను ఇంటర్వ్యూ అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కబెట్టుకుంటారు. 
 
మీనం : చిన్న చిన్న తప్పిదాలు దొర్లే సూచనలున్నాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు ప్రయాణాలలో ఏకాగ్రత, మెళకువ చాలా అవసరం. విలువైన వస్తు కొనుగోళ్ళలో స్త్రీలకు అవగాహన ముఖ్యం.