1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
  4. Guru Pradosh Vrat 2023: Puja Vidhi

గురు ప్రదోషం.. నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో నటరాజ స్వామి నృత్యం

Lord Shiva
గురు ప్రదోషం నేడు. ఈ రోజున పరమేశ్వరుడిని పూజించేటప్పుడు ఎరుపు లేదా గులాబీ రంగు దుస్తులను ధరించాలి. శివలింగానికి బిల్వా పత్రాలు, ధూపం, దీపం, చందనం, గంగాజలం, నీరు, పండ్లు, పువ్వులు, మిఠాయిలు మొదలైన వాటిని సమర్పించాలి. 
 
సాయంత్రం ప్రదోష వేళలో జరిగే పూజలో పాల్గొన్నాలి. శివుడిని నిష్ఠతో పూజించాలి. నటరాజ స్వామి నందీశ్వరుని కొమ్ములకు మధ్యలో ఆడే సమయాన్నే ప్రదోష కాలం, ప్రదోష సమయం అంటారు. ప్రదోష కాలంలో నటరాజ స్వామిగా శివ స్వరూపుడు చేసే నృత్యాన్ని వీక్షించేందుకు శివాలయాలకు విచ్చేస్తారని విశ్వాసం. 
 
ఈ కాలంలో శివునిని ఆరాధిస్తే.. సమస్త దేవతలను ఆరాధించినట్లే. అందుకే నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుడిని దర్శించడం శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రదోష కాలంలో పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
శివ ప్రదోష స్తోత్రము.. సాయంత్రం 4.30 గంట నుంచి..