గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 25 అక్టోబరు 2023 (20:19 IST)

గాడిద పాలు: గుండెకి బలం ఎముకలు దృఢం

Milk
గాడిద పాలు. ఈ పాలలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ పాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. 
గాడిద పాలు ఆవు పాలకు ప్రత్యామ్నాయమనీ, తల్లి పాలకు సమానమైన పోషక విలువలున్నాయంటారు. గాడిద పాలలో ఆవు పాల కంటే తక్కువ కొవ్వు, ఎక్కువ ఖనిజాలు, లాక్టోస్ వుంటాయి.
 
విటమిన్, మినరల్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి మేలు చేస్తాయి. పాలు తాగే శిశువులకు ఈ పాలు ఎంతగానో మేలు చేస్తాయి. గాడిద పాలు తాగితే గుండె- ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి. గాడిద పాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి.
 
అలెర్జీ ఆస్తమా నివారణలో గాడిద పాలలోని లైసోజైమ్, లాక్టోఫెర్రిన్ కీలక పాత్ర పోషిస్తాయి. గమనిక: చిట్కాలను పాటించే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.