శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 19 అక్టోబరు 2023 (18:38 IST)

ప్రతిరోజూ చికెన్ తినవచ్చా? తింటే ఏమవుతుంది?

Tandoori chicken
మాంసాహారం తినేవారిలో చాలామందికి చికెన్ అంటే చాలా ఇష్టం. ఐతే వారానికి ఒకటి లేదా రెండుసార్లు తింటుంటారు కొందరు. ఐతే రోజూ చికెన్ తింటేమాత్రం వ్యతిరేక ఫలితాలుంటాయంటున్నారు పోషకార నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము. రోజూ చికెన్ తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ చికెన్ తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు పెరుగుతాయి.

రోజూ చికెన్ తింటే కీళ్లనొప్పులు వంటి సమస్యలు చాలా త్వరగా వస్తాయి. రోజూ చికెన్ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ముక్కు నుంచి రక్తం కారడం, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ చికెన్ తినే వ్యక్తి అయితే, దీన్ని దాటవేసి వారానికి రెండు రోజులు తినవచ్చు.

మూత్ర మార్గం అంటువ్యాధులు, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యానికి గురికావచ్చు. ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సైతం వచ్చే ప్రమాదం వుంటుంది. ఈ సమాచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.