శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (19:28 IST)

ఎన్‌.టి.ఆర్‌. కొత్త యాడ్‌ షూట్‌లో బిజీ 7 కోట్ల ఆఫర్!

N.T.R.  new ad shoot!
N.T.R. new ad shoot!
ఎన్‌.టి.ఆర్‌. జూనియర్‌ ఈమధ్య వాణిజ్యప్రకటనలో బిజీగా వుంటున్నాడు. ఫుడ్‌, డ్రీం క్‌ యాడ్స్‌ను చేస్తూ యూత్‌ను తినమని, తాగమని ఎంకరేజ్‌ చేస్తున్నాడు. మెక్‌డొనాల్డ్‌ స్పైసీ చికెన్‌, యాపీ పిజ్‌ వంటి వాటికి ప్రచారం చేశాడు. కాగా కొత్తగా ఓ యాడ్‌లో పాల్గొన్నారు. గడ్డెం స్టయిలిష్‌గా పెంచి కళ్ళజోడు టేబుల్‌పై పెట్టి ఇలా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోను ఈరోజు విడుదల చేశారు.
 
ఈ వాణిజ్య ప్రకటన కోసం దాదాపు 7 కోట్లు తీసుకున్నాడని పిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ యాడ్‌ ఏమిటి? త్వరలో తెలియజేయనున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఎన్‌.టి.ఆర్‌. నటిస్తున్న దేవర సినిమా షూటింగ్‌ దశలో వుంది. సముద్ర దొంగల నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీకపూర్‌ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత హృతిక్‌ రోషన్‌తో కలిపి వార్‌ 2 సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.