బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 ఆగస్టు 2023 (18:55 IST)

పృథ్వీ షా అదుర్స్- 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు

Prithvi Shaw
స్టార్ క్రికెటర్ పృథ్వీ షా భారత జట్టులో తన స్థానాన్ని నిలుపుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. కొన్నేళ్లుగా దేశవాళీ పోటీల్లో అద్భుతంగా ఆడుతున్న పృథ్వీ షా.. భారత జట్టులో చోటు దక్కించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. 
 
కాగా, పృథ్వీ షా బుధవారం నార్తాంప్టన్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో సోమర్‌సెట్‌తో జరిగిన వన్డే కప్ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్ తరఫున 129 బంతుల్లో డబుల్ సెంచరీతో తన సత్తా చాటాడు.

పృథ్వీ షా 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేయడంతో నార్తాంప్టన్‌షైర్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగులు చేసింది. లిస్ట్-ఎ క్రికెట్‌లో నార్తాంప్టన్‌షైర్ అత్యధిక స్కోరు ఇదే. లిస్ట్-ఎ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఆరవ అత్యధిక స్కోరు కావడం గమనార్హం.