మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 21 అక్టోబరు 2023 (22:00 IST)

ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెతో ఇలా చేస్తే బానపొట్ట కరిగిపోతుంది...

Belly Fat
ఉత్తరేణి. ఆయుర్వేదంలో ఈ మొక్కకి చెందిన ఆకులు, బెరడును ఉపయోగిస్తుంటారు. ఉత్తరేణి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. ఉబ్బసంతో బాధపడేవారికి ఉత్తరేణి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి గింజలు, మిరియాలు మెత్తగా నూరి ఆ చూర్ణాన్ని తుమ్మజిగురులో నానబెట్టి నూరి శనగ గింజంత తీసుకుంటే ఫలితం వుంటుంది. ఉత్తరేణి వేర్లు, కుప్పింట చెట్టు వేళ్లు మెత్తగా నలగ్గొట్టి నూలుబట్టలో వేసి వాసన చూస్తుంటే చలిజ్వరం తగ్గుతుంది.
 
ఉత్తరేణి ఆకులు, మిరియాలు, సహదేవి చెట్టు వేర్లు పైతోలు కలిపి మెత్తగా నూరి మిరియాల గింజలంత గోలీలుగా చేసి తింటే బక్కగా వుండేవారు బలిష్టమై వృద్ధి చెందుతారు. ఎర్ర ఉత్తరేణి ఆకు రసం, ఆవునెయ్యితో కలిపి తీసుకుంటే రక్తమొలలు తగ్గిపోతాయి.
 
ఉత్తరేణి రసాన్ని నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై రసం అంతా ఇగిరిపోయేట్లు చేసి మిగిలిన నూనెను రోజుకి ఒకసారి పొట్టపై మర్దిస్తే బానపొట్ట తగ్గుతుంది. గమనిక: చిట్కాలను పాటించే ముందు మోతాదు విషయమై ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించాలి.