1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 అక్టోబరు 2023 (22:53 IST)

డెంగూ జ్వరాన్ని తరిమికొట్టాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

Dengue
దేశంలో డెంగూ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వర్షాలకు దోమల బెడద ఎక్కువ కావడంతో డెంగ్యూ ఫీవర్ సులభంగా వ్యాపిస్తోంది. ఈ డెంగ్యూ వ్యాధిని దూరం చేసుకోవాలంటే.. ఆయుర్వేద చిట్కాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.
 
వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్లనే డెంగ్యూ జ్వరం వ్యాపిస్తోంది. రోగ నిరోధక శక్తి పెరగాలంటే.. తులసి, మిరియాలను దంచి టీలా తయారు చేసుకోవాలి. తులసిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
అలాగే బొప్పాయి ఆకుల రసాన్ని తక్కువ మోతాదులో తీసుకుంటే డెంగ్యూ జ్వరం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే డెంగూ జ్వరం రాకుండా శరీరంలో రక్తపు అణువులు పెరుగుతాయి. 
 
ఇంకా ఉసిరికాయ రసాన్ని తీసుకోవడం ద్వారా డెంగ్యూ ఫీవర్‌ను నయం చేసుకోవచ్చు. ఉసిరిలోని విటమిన్ సి.. వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. దీంతో డెంగ్యూ జ్వరంతో పాటు అనేక వ్యాధులను దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.