ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2023 (15:37 IST)

పెరుగుతున్న డెంగీ కేసులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Dengue
వెస్ట్ బెంగాల్‌లోని సిల్ గురిలో డెంగీ కేసులు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కొండవాగుల్లో మొత్తం 19 మంది డెంగ్యూ బారిన పడ్డారు. గతేడాది ఆ సంఖ్య ఐదుగా ఉంది.
 
ప్రస్తుతం దీనిపై జిల్లా యంత్రాంగం వరకు ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే డార్జిలింగ్ జిల్లాలో డెంగ్యూ వ్యాపించింది. పర్వత ప్రాంతాల్లో ఏడు నెలల్లో 19 మంది డెంగ్యూ బారిన పడ్డారు. 
 
వీరిలో 8 మంది డార్జిలింగ్ మునిసిపాలిటీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది ఏడు నెలల్లో జిల్లావ్యాప్తంగా 53 డెంగీ కేసులు నమోదయ్యాయి.  
 
జాగ్రత్తలు  
పాలు, పెరుగు, చేపలు, గ్రుడ్లు, కోడి మాంసం లాంటి పౌష్టికాహారం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే బీట్ రూట్, దానిమ్మ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
జ్వరం తగ్గాక పోషకాలతో కూడిన శుభ్రమైన పరిసరాల్లో తీసిన చెరకు రసం, కొబ్బరినీళ్లు, తాజా పండ్ల రసం లాంటివి ఇవ్వాలి. నిమ్మకాయను రెండు భాగాలుగా కోసి అందులోని ఒక్కో భాగంలో పది లవంగాలను అందులో గుచ్చాలి. దీంతో డెంగీ దోమలు ఆ ప్రాంతంలోకి రావు.