మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జులై 2023 (09:32 IST)

పోషకాలు గని షిమ్లా మిర్చి ... ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. ఎన్నెన్నో...

shimla mirchi
సాధారణంగా ప్రతి ఒక్కరికీ కొన్ని కూరగాయలు నచ్చవు. అలాంటి వాటితో వంటలు చేస్తే అస్సలు నచ్చవు. అలాంటి వాటిలో క్యాప్సికంతో తయారు చేసే వంటలను కొందరు అస్సలు నోట్లో పెట్టుకోరు. కానీ, అలాంటి క్యాప్సికంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. 
 
సలాడ్లూ, ఫాస్ట్ ఫుడ్ వంటకాల్లో వీటిని ఎక్కువగా వాడుతుంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రిక్, మూత్రాశయ, గర్భాశయ కేన్సర్లు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలానే ఇవి ఫ్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. చర్మ సమస్యలను తగ్గిస్తాయి. 
 
వృద్ధాప్య సంకేతాలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది బలమైన కొలాజెన్‌ని నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే మహిళలకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అర్థరైటిస్ ప్రమాదాన్నీ తగ్గిస్తుంది. రోగ నిరోధకశక్తి కల్పించి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 
 
క్యాప్సికంలో లైకోపిన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతాయి.