శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (11:07 IST)

జిడ్డు చర్మం ఉపశమనం పొందాలంటే ఈ పని చేయండి!

apple cider venigar
చాలామంది చర్మ సౌందర్యం కోసం వివిధ రకాలైన మందులు వాడుతుంటారు. అలాంటి వారు యాపిల్ సిడర్ వెనిగర్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
యాపిల్ సిడర్ వెనిగర్‌ను చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించటానికి వాడవచ్చు. దీనిని క్రమం తప్పకుండా ప్రతిరోజు రాస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. 
 
అలాగే, కొందరికి చర్మం జిడ్డుతో ఉంటుంది. అలాంటి వారు యాపిల్ సిడర్ వెనిగర్‌ను రాసి మర్దనా చేయడం వల్ల రక్తస్రావం సరిగ్గా అవుతుంది. ఇది జిడ్డు చర్మానికి పరిష్కార మార్గం చూపుతుంది. 
 
ముఖంపై వచ్చే పొక్కులు. వాటి వల్ల వచ్చే మచ్చలు ఎక్కువ కాలం పోకపోతే యాపిల్ సిడర్ వెనిగర్ ఒక మంచి మందు. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల ఈ పొక్కులు, మచ్చలు తొలగిపోతాయి.
 
కొందరు దీనిని సన్ స్క్రీన్ లోషన్ మాదిరిగా కూడా ఉపయోగిస్తారు. సస్క్రీన్ లోషన్ బదులుగా దీనిని ఉపయోగించుకోవాలనుకొనేవారు యాపిల్ సిడర్ వెనిగార్‌లో కొద్దిగా నీళ్లు కలిపి రాసుకోవాలి. దీని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది.