గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 31 మే 2023 (22:57 IST)

రాగులు, రాగి జావ తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ragijava
రాగులు. వీటిలో ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. రాగిపిండితో తయారుచేసే ఆహారాలు తీసుకోవడం వల్ల అదనపు క్యాలరీలను గ్రహించకుండా జీర్ణక్రియను నిదానం చేస్తుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. రాగులు తీసుకుంటే కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడతాయి.
మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారు చేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
 
రాగులు తీసుకుంటే కాలేయంలోని అదనపు కొవ్వు తొలగించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి తక్కువ చేయడానికి బాగా సహాపడుతుంది. రాగుల్లో నేచురల్ ఐరన్ పుష్కలంగా వుంటుంది కనుక అవి తీసుకుంటే రక్తహీనత నివారించడానికి సహాయపడుతుంది. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల అవి తీసుకునేవారి వయస్సు తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగుల పిండితో చేసిన జావ తీసుకుంటుంటే అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది ఒక టానిక్‌లా పనిచేస్తుంది.