1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
  4. Summer special Millet Porridge recipe

ఎండకు హాయిగా చిరు ధాన్యాలతో జావ.. ఎలా చేయాలి?

Millet Porridge recipe
Millet Porridge recipe
నిత్యం చిరు ధాన్యాలు తినడం ఆరోగ్యానికి మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చిరు ధాన్యాలు తీసుకోవచ్చు. అలాంటి చిరు ధాన్యాలతో జావ తాగితే ఎండకు హాయిగా వుంటుంది. ఆ జావ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావల్సిన పదార్థాలు: 
రాగులు, కొఱ్ఱలు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు- చెరో 50 గ్రాములు 
శెనగపప్పు - 50 గ్రాములు,
మజ్జిగ - 3 కప్పులు, 
నీళ్లు - ఆరు కప్పులు, 
ఉల్లిముక్కలు - అరకప్పు,
జీలకర్ర - 1 స్పూను, 
కరివేపాకు - కావలసినంత, 
పచ్చిమిర్చి - 3, 
ఆవాలు - 1 స్పూన్ , 
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు,
కొత్తిమీర తరుగు, ఉప్పు - తగినంత.
 
తయారీ విధానం :
రాగులు, కొఱ్ఱలు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు వీటిని వేయించి రవ్వలా మిక్సీలో పట్టి పెట్టుకోవాలి. ఆపై కుక్కర్‌లో నీరు పోసి అవసరమైనంత ఉప్పు వేసి రవ్వలా కొట్టిన చిరు ధాన్యాలను చేర్చి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దించేయాలి. ఆపై బాణలిలో 2 టీస్పూన్ల నెయ్యి పోసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి కుక్కర్‌లోని ఉడికించిన జావలో వేయాలి. తర్వాత మజ్జిగ, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకుని తాగాలి. ఇది శరీరానికి బలాన్నిస్తుంది. పిల్లల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. పెద్దలను డయాబెటిస్ నుంచి కాపాడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తుంది. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మట్టి కుండలోని చల్లని నీటిని తాగితే?