మంగళవారం, 16 జులై 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 12 జూన్ 2022 (18:42 IST)

వేసవి ముగింపు, ఆవకాయతో పసందు

Allam-Avakaya
వేసవి ముగింపుకొచ్చింది. ఒకవేళ మీరు ఇంకా పచ్చళ్లు పెట్టుకోకపోతే ఇదే తగిన సమయం. ఈ సీజన్‌లో తయారుచేసుకున్న పచ్చళ్లను వర్షాకాలంలో ఆరగారగా తింటూంటే పొందే ఆనందం వర్ణనాతీతం. దేశవ్యాప్తంగా విభిన్న రకాల పచ్చళ్లు ఉంటుంటాయి కానీ దక్షిణ భారతదేశం అందునా, తెలుగు రాష్ట్రాలలో పచ్చళ్లు పరంగా చూస్తే నోరూరించే వాటి జాబితా పెద్దగానే ఉంటుంది. అమ్మమ్మల సీక్రెట్‌ పచ్చళ్లతో సహా ఈ సీజన్‌లో ప్రయత్నించే కొన్ని పచ్చళ్ల జాబితా ఇదిగో...

 
1. వేసవిలో పచ్చడి అనగానే జాబితాలో ముందుగా వచ్చేది మామిడి ఆవకాయ. దీనిని ఎక్కువకాలం నిల్వఉంచుకోవడానికి వీలుండటం (అనుకుంటాం కానీ సగం రోజుల్లోనే ఖాళీ చేసేస్తాం). కనీస పదార్థాలతోనే చేసుకునే తీరు, కొన్నిసార్లు శెనగపప్పు లాంటి సీక్రెట్‌ ఇంగ్రీడియెంట్‌తో కూడా ఆవకాయకు కొత్త రుచులను జోడిస్తుంది.

 
2. బెల్లం ఆవకాయ ఈ సీజన్‌లో మరో వైవిధ్యమైన పచ్చడి. బెల్లం వల్ల తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కాకపోతే బెల్లం నాణ్యత బాగుండాలని ఈ తరహా పచ్చడి పెట్టే తాయారమ్మ అన్నారు.

 
3. నువ్వులతో మామిడి పచ్చడి- దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. దీని రుచి మాత్రం అమోఘం అని అనకుండా ఎవరూ ఉండరు.

 
4. అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్‌తో- తాయారమ్మ చెప్పేదాని ప్రకారం ఈ అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్‌.

 
5. పల్లి ఆవకాయ. ఇది నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు అత్యుత్తమ నాణ్యతతో ఉంటే పచ్చడి కూడా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

 
6. ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడి. మాకు తెలిసి మీరిప్పటికే కొన్ని మామిడికాయలు ఆరబెట్టి ఉంటారు.

 
7. ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్‌లో ట్రై చేయొచ్చు.

 
గోల్డ్‌డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ, ‘‘వేసవి అంటే మన చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు, చట్నీలు చేసుకోవడం ద్వారా కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం ఉండేది. భోజన సమయంలో ఆవకాయ లేదంటే మరేదైనా పచ్చడి వాసన లేదంటే రుచి చూస్తే ఎక్కడా లేని ఆనందం తొణికిసలాడేది. ఈ రోజు ఏ పచ్చడి అనే మాట కూడా తరచుగా వినిపించేది. ఆ రుచి మాత్రం ఎన్నటికీ గుర్తుంచుకునే రీతిలోనే ఉంటుంది. ఎలాగంటే, స్వాద్‌ జో జిందగీ సే జుడ్‌ జాయే లా ...’’ అని అన్నారు.