శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 మే 2023 (15:41 IST)

వేసవిలో జీర్ణ సమస్యలకు పరిష్కారం ఏంటి?

చాలా మందికి వేసవికాలంలో జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. దీనికి కారణం సరైన ఆహారం తీసుకోకపోవటం. ఎక్కువగా నీళ్లు తాగకపోవటం. వేడిలో ఎక్కువ సేపు ఉండటం. ఇత్యాది కారణాల వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటి పరిష్కారానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. 
 
ఓట్స్ : ఓట్స్ వల్ల అనేక రకాల ప్రయోజనాలున్నాయని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. ఓట్స్‌లో కేలరీలు తక్కువ ఉండటంతో పాటుగా మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పెరగటానికి ఉపకరిస్తుంది. 
 
బార్లీ లేదా రాగులు : ప్రతి రోజూ బార్లీ నీళ్లు తాగటం. రాగి సంగటిని తినటం వల్ల వేసవిలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని అంటున్నారు. బార్లీ, రాగి మన కడుపులో ఏర్పడే అల్సర్లను తగ్గించటంతో పాటుగా గ్యాస్‌ను కూడా నివారిస్తాయి. 
 
పెసర మొలకలు : ఉదయాన్నే పెసర మొలకలు తినటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని పౌష్టికాహార నిపుణులు పేర్కొంటున్నారు. పెసర మొలకల్లో ఫైబర్, ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. పెసర మొలకలను తినటం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అంతేకాకుండా దీనిలో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. 
 
పెరుగన్నం : వేసవిలో పెరుగన్నం తప్పనిసరిగా తినాలి. పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ మన ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పెరుగన్నం తినటం వల్ల ఎక్కువ సమయం ఆకలి కూడా వేయదు.