అరటిపండుతో కలిగే ప్రయోజనాలు ఏంటి?
ఆయిర్వేదంలో అరటిపళ్లకు ఒక ప్రత్యేకమైన స్థానముంది. అజీర్తి వంటి సమస్యలకు ఆయిర్వేద వైద్యులు అరిటిపళ్లను ఆరగించాలని సలహా ఇస్తుంటారు. అలాంటి అరటి పండు వల్ల కలిగే ప్రయోజనాలను ఓసారి పరిశీలిస్తే,
కొందరికి అజీర్తి వల్ల తీవ్రమైన కడుపునొప్పి వస్తూ ఉంటుంది. సమయానికి ఆహారం తినకపోవటం వల్ల కడుపులో వాయువులు పెరిగిపోవటం.. ఫైబర్ ఉన్న పదార్థాలు తినకపోవటం. ఎక్కువ నీళ్లు తాగకపోవటం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది.
అలాంటి వారు రోజుకు ఒక అరిటిపండు తినటం వల్ల అజీర్తి సమస్య పరిష్కారమవుతుంది. దీనిలో ఉండే కొన్ని రకాలైన రసాయనాలు కడుపులో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను బయటకు పంపుతాయి.
అజీర్తి ఎక్కువ కాలం ఉండి. ఆహారం సరిగ్గా అరగకపోయినప్పుడు కొందరిలో పైల్స్ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి వారు ఎక్కువ సేపు కూర్చోలేక ఇబ్బంది పడుతుంటారు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా సమస్యలు ఎదురవుతాయి. అలాంటి వారు క్రమం తప్పకుండా అరటిపండును తింటే ఈ సమస్య నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.