1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 ఏప్రియల్ 2023 (16:40 IST)

కంది పొడిలో వున్న పోషకాలు ఏమిటి?

Diabetes
తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకం కంది పొడి. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటుంటే ఎంతో రుచిగా వుంటుంది. అంతేకాదు, ఈ కంది పొడి తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేమిటో తెలుసుకుందాము. కంది పొడి ప్రోటీన్లకు ముఖ్య మూలం, ప్రత్యేకించి శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయం.
 
కంది పొడిలో పెద్దమొత్తంలో ఫైబర్, చాలా తక్కువ సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు కంది పొడి తింటుంటే ఉపయోగం వుంటుంది. ఫోలిక్ యాసిడ్, కాల్షియం, ఐరన్ కలిగి ఉన్నందున ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైనది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కంది పొడిని పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన ముఖ్య ఖనిజమైన పొటాషియం ఇందులో వుంది.