1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
  4. fig fruit benefits for male

అత్తి పండ్లతో మగవారికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

Amazing Health Benefits of Anjeer fruit
అత్తి పండ్లలో విటమిన్ ఎ, బి, సి, కెతో పాటు కార్బోహైడ్రేట్లు, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మొదలైనవి ఉంటాయి. అత్తి పండ్లను తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అత్తి పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అధిక బరువు తగ్గించటంలో సానుకూల ప్రభావం కలిగి ఉంటుంది. అత్తి పండ్లను తీసుకోవటం వలన మగవారికి కావలసిన శక్తి వస్తుందని చెపుతారు.
 
అత్తి పండ్లలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి కనుక గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యం ఉంటుంది. అత్తి పండ్లలో ఉండే ఫైబర్ అనేక రకాల కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, పెద్దప్రేగు కేన్సర్ నివారించడంలో అత్తి పండ్లు సహాయపడతాయి. అత్తి పండు ఆకులు నుంచి తయారుచేసిన రసంను అల్పాహారంలో చేర్చి తీసుకుంటే డయాబెటిస్ అదుపులో వుంటుంది.
 
అత్తి పండ్లలో పొటాషియం అధికంగా, సోడియం తక్కువగా ఉంటుంది, కాబట్టి అది రక్తపోటుకు దూరంగా ఉంచటానికి సహకరిస్తుంది. మూలశంక వ్యాధి లేదా మొలలుతో బాధపడేవారు అత్తి పండ్లను ప్రతి రోజు తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్తి పండ్లలో ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో కలిగి ఉండుట వలన మూత్రపిండ సంబంధిత వ్యాధి లేదా పిత్తాశయం సమస్యతో బాధపడేవారు అత్తి పండ్లను తినకూడదు.
About Writer
సిహెచ్
తర్వాతి కథనం
మామిడి గింజల సారాన్ని తాగితే?