మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2023 (12:37 IST)

బాబోయ్ ఎండలు... శరీరం వేడిబారినపడకుండా ఉండాలంటే..

summer
సాధారణంగా వేసవి కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మసాలా ఆహారం, అధిక శీతల పానీయాలు, ఐస్‌క్రీమ్స్ వంటి చల్లని పదార్థాలను ఆరగించడం వల్ల శరీరం వేడిబారినపడకుండా ఉంటుంది. అలాగే, సీజనల్ పండ్లను అధికంగా సేవించారు. జ్యూస్‌లు, మంచినీళ్లు సేవిస్తూ ఉండాలి. 
 
వేసవి అంటేనే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. ఎండాకాలంలో మాత్రమే దొరికే ఈ తీపిపండులో అత్యధిక శాతం నీరు ఉంటుంది. ఈ పండు తినటం వల్ల బరువు తగ్గుతారు. చర్మం మృదువుగా తయారవుతుంది. శరీరంలోని వేడి ఇట్లే తగ్గిపోతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
అదేవిధంగా, వేసవిలో రారాజు మామిడికాయనే. వీటిలో ఏ, సీ విటమిన్స్ ఉంటాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. వీటిలో ఐరన్, కాల్షియం ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించటంతో పాటు ఎముకలు గట్టిగా ఉంటాయి.
 
కూల్ డ్రింక్స్ కంటే అధికంగా ఉపశమనాన్ని ఇచ్చేది కొబ్బరి నీళ్లు. పౌషకాల గని. వీటిలోని ఎలక్ట్రోలైట్స్ మంచి హైడ్రేట్స్ ఏజెంట్స్ పని చేస్తాయి. వేడిని తగ్గించటంతో పాటు జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయివి. ముఖ్యంగా కొబ్బరినీళ్లు తాగితే రిఫ్రెషింగ్ ఉంటుంది.
 
అన్నింటికంటే తక్కువ ధరలో దొరికేది నిమ్మకాయరసమే, నిమ్మరసంలో కాస్త ఉప్పు లేదా చక్కెర కలిపి తాగితే శరీరంలోని వేడి తగ్గిపోయి చక్కటి ఉపశమనం కలుగుతుంది. అందరికీ అందుబాటులో ఉండే పండిది.
 
వేసవిలో మోసంబి పండు తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకుపోతాయి. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల వ్యాధి నిరోధకశక్తిని ఇస్తుంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలం ఈ పండులో కాబట్టి వడదెబ్బ తగిలిన వారికి ఉపశమనం లభిస్తుంది.