గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (22:39 IST)

పుదీనా నీరు తాగితే ఏం జరుగుతుంది? (video)

Pudina
వేసవిలో పుదీనా నీరు లేదా పుదీనా ఆకు కషాయం తాగుతుంటే శరీరం చల్లబడుతుంది. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో పుదీనా నీరు, పుదీనా కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో పుదీనా నీటిని తాగడం వల్ల వేసవి తాపం తీరడమే కాకుండా వడదెబ్బ తగలకుండా వుంటుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
 
పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. పావు కప్పు తాజా పుదీనా ఆకులతో చేసిన పుదీనా ఆకు కషాయంలో 12 కేలరీలుంటాయి. పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తేలింది. పుదీనా ఆకు కషాయం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పుదీనా నీటిని తాగితే నోటి దుర్వాసన పోగొడుతుంది.