1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 27 మార్చి 2023 (22:30 IST)

లేత మునగ ఆకు కూర పురుషులు తింటే?

Drumstick Leaves
మునగాకు, మునగ పూలు, మునగ కాయలు ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తాయి. వీటితో పాటు మునగ బెరడు, వేర్లు ఇలా ప్రతి భాగాన్ని అనేక వ్యాధులకు ఔషధాలుగా వినియోగిస్తారు. అవేమిటో తెలుసుకుందాము. మునగాకు, వసకొమ్ము, వాము సమంగా కలిపి దంచి నూనెలో ఉడకబెట్టి గాయాలకు, దెబ్బలకు కడితే మానుతాయి.మునగాకును దంచి తీసిన రసం పిల్లల వయసును బట్టి ఐదారు చుక్కల్లో చిటికెడు ఉప్పు కలిపి తాగిస్తే అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.

 
లేత మునగ ఆకు కూర వండుకుని తింటుంటే పురుషులకు శక్తినిస్తుంది. సుఖ విరేచనం కలుగాలంటే మునగాకు తింటుండాలి. మునగ కాయలు, ఆకులు కూరగా చేసుకుని తింటే స్త్రీలకు శరీరంలో చెడునీరు తొలగుతుంది. బాలెంతలకు తల్లిపాలు పెంచే గుణం మునగకు వుంది. మునగాకు రసం నేత్ర రోగాలను, వాత, పైత్య దోషాలను, విషాలను హరిస్తుంది.