సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 మార్చి 2023 (22:59 IST)

బెల్లంతో సజ్జ రొట్టెలు తింటే ఫలితాలు ఏంటి?

millets
సజ్జలు. రక్తహీనతతో బాధపడేవారు సజ్జలతో తయారుచేసిన పదార్థాలు తినడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెపుతారు. సజ్జల్లో వున్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సజ్జలలో విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా వున్నందువల్ల ప్రోటీన్స్ పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల ఆహారం నిదానంగా జీర్ణమై చక్కెర నిల్వలు నెమ్మదిగా విడుదలవుతాయి.
 
షుగర్ వ్యాధితో బాధపడేవారికి సజ్జలు చక్కని ఆహారం, ఎందుకంటే ఇవి షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతాయి. స్థూలకాయ సమస్య ఉన్నవారు ప్రతిరోజు మొలకెత్తిన సజ్జలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.పిల్లలు ఉల్లాసంగా, ఆరోగ్యంగా, దృఢంగా పెరగడానికి సజ్జలు దోహదపడతాయి.
 
ప్రతిరోజు ఉదయాన్నే పిల్లలకు మొలకెత్తిన సజ్జలను పెట్టడం ద్వారా ఎత్తు పెరుగుతారు.
సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తింటుంటే రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వుని తగ్గించి రక్తంలోని కొలస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. సజ్జలలో ఫాస్పరస్ అధికంగా ఉంటుంది, కనుక మనలోని ఒత్తిడిని తగ్గించి మంచి నిద్ర పట్టేలా చేస్తుంది.