మామిడిపండ్లను ఆరగించే ముందు నీళ్ళలో నానబెట్టడం వల్ల కలిగే లాభాలు ఏంటి?
సాధారణంగా వేసవి కాలంలో లభ్యమయ్యే అరుదైన పండు మామిడి పండు. ఈ పండును ఆరగించని వారంటూ ఉండరు. వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖంపై మొటిమలు.. వంటివి తలెత్తుతాయి.
ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు. అయితే, ఈ పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తినే ముందు కాసేపు నీళ్లలో నానబెట్టడం వల్ల ఆరోగ్యపరంగా మంచిదంటున్నారు.
మామిడి పండులో ఎ, సి, ఇ, కె, బి విటమిన్లతో పాటు ఫోలేట్.. వంటి పోషకాలు మిళితమై ఉన్న మామిడి పండ్లు రుచిలోనే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలోనూ మిన్నే. ముఖ్యంగా చర్మం, జుట్టు సంరక్షణ విషయాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే ఈ ప్రయోజనాలన్నీ చేకూరాలంటే తినే ముందు వాటిని ఒకటి రెండు గంటల పాటు నీటిలో నానబెట్టడం మంచిదంటున్నారు. ఒకవేళ వెంటనే తినాలనుకునే వారు కనీసం పావుగంట పాటైనా నీటిలో నానబెట్టాలట!
వేసవిలో తప్ప ఇతర సీజన్లలో దొరకవని కొంతమంది అమితంగా వీటిని లాగించేస్తుంటారు. దీనివల్ల శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తవుతుంది. ఫలితంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ముఖంపై మొటిమలు.. వంటివి తలెత్తుతాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టాలి. తద్వారా పండ్ల నుంచి శరీరంలో వేడి ఉత్పత్తి చేసే గుణాలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు.
వేసవి కాలంలో సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లు దొరకట్లేదు. వివిధ రకాల రసాయనాలు ఉపయోగించి వాటిని త్వరగా పక్వానికి తీసుకొస్తున్నారు. ఇలా వాడిన రసాయనాలు పండు తొక్కపై చేరతాయి. అది గమనించకుండా వాటిని ఆదరాబాదరాగా శుభ్రం చేసుకొని తీసుకుంటే.. ఆరోగ్యానికే ప్రమాదం. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు, శ్వాస సంబంధిత రుగ్మతలు, కంటి- చర్మ అలర్జీ, మలబద్ధకం, వివిధ రకాల క్యాన్సర్లు.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలంటే తినే ముందు మామిడి పండ్లను నీటిలో నానబెట్టడమొక్కటే మంచిదని అంటున్నారు.