శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 5 ఏప్రియల్ 2023 (16:36 IST)

వేప విత్తనాలను చూర్ణం చేసి మంచినీటిలో కలిపి ఆ రసం తాగితే ఏమవుతుంది?

వేప. ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేప అనేది అన్ని ఔషధాలలోకెల్లా రారాజు. ఈ వేపలో ఎన్నో నమ్మశక్యం కాని ఔషధ ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. వేపాకు క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడుతుందని ఆయుర్వేదం చెపుతుంది. శరీరంలో హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేయడంలో వేపాకు ఎంతో సహాయపడుతుంది. స్నానం చేసే ముందు వేపాకు పేస్టుతో శరీరాన్ని రుద్దుకుని కొద్దిసేపు ఆరాక స్నానం చేస్తే అది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది.
 
వేప జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ పునర్వ్యవస్థీకరించబడుతుంది. మధుమేహం వ్యాధిని నిరోధించడంలో వేప దోహదపడుతుంది. వేప రసంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ ఎంజైములు పుష్కలంగా వుంటాయి. వేప విత్తనాలు నలగ్గొట్టి మంచినీటిలో కలిపి వడగట్టి రసం తాగితే కడుపులో పురుగులు నాశనమవుతాయి. దంత సమస్యలను నయం చేయడంలో వేప బెరడు అద్భుతంగా పనిచేస్తుంది.