గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 16 మే 2023 (17:25 IST)

గుండెపోటు లక్షణాలు ఏంటి?

heart stroke
ఇటీవలికాలంలో గుండెపోటులు సర్వసాధారణంగా మారిపోయాయి. స్త్రీపురుషులు అనే తేడా లేకుండా వస్తున్నాయి. అయితే, స్త్రీపురుషుల్లో ఈ ఇవి వేర్వేరుగా ఉంటున్నాయి. అందువల్ల గుండెపోటుపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. 
 
మహిళలకు తల తిరుగుడు, మత్తు, వీపు నొప్పి, ఛాతీలో ఒత్తిడి, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడ, లేదా పొట్టలో నొప్పి, స్పృహ కోల్పోవడం, విపరీతమైన నిస్సత్తువ, గుండె పోటులో ఛాతీ నొప్పి సహజం. కానీ మహిళల్లో, ఈ లక్షణం ఉండవచ్చు, ఉండకపోవచ్చు.
 
అలాగే, పురుషుల్లో చమటలు పట్టడం, వాంతి, ఛాతీలో ఒత్తిడి, నొప్పి, శ్వాసలో ఇబ్బంది, ఒకటి లేదా రెండు చేతుల్లో నొప్పి, వెన్ను, మెడ, దవడల్లో లేదా పొట్టలో నొప్పి వంటి లక్షణాలు ఐదు నిమిషాలకు మించి వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. లక్షణాలు కనిపించని గంటలోగా చికిత్స మొదలుపెడితే చికిత్స ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.