గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మే 2023 (15:55 IST)

ఛత్తీస్‌గఢ్ : వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ వ్యక్తి మృతి

Man heart attack
Man heart attack
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ ఎలక్ట్రికల్ ఉద్యోగి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన వ్యక్తి వివాహ వేడుకలో డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఎలక్ట్రికల్ ఉద్యోగి అయిన అతను మే 5వ తేదీ రాత్రి రాజనాంగన్ జిల్లా డోంకర్‌ఘర్‌లో తన కోడలు వివాహ వేడుకలో పాల్గొన్నాడు. అక్కడ కొంతమంది డాన్స్ చేస్తున్నారు. 
 
ఇది చూసిన దిలీప్ రెచ్చిపోయి వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. అప్పుడు వేదికపై డ్యాన్స్ చేస్తున్న దిలీప్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 
 
వెంటనే వారు దిలీప్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు దిలీప్ మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ సందర్భంలో వేదికపై దిలీప్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో స్పృహతప్పి పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.