సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 10 మే 2023 (20:21 IST)

శీరత్ కపూర్ పుష్ప 2లో ఐటెం సాంగ్ చేసిందా ?

allu arjun, Sheerat Kapoor
allu arjun, Sheerat Kapoor
అల్లు అర్జున్,  రష్మిక మందన్న నటించిన పుష్ప: ది రైజ్‌లో సమంత రూత్ ప్రభు తన ‘ఊ అంటావా’ అంటూ డాన్స్ చేస్తే పెద్ద కాంట్రవర్సటీ అయింది. ఆ సినిమా చివర్లో సుకుమార్ రివీల్ చేశారు. కానీ పుష్ప 2కు మాత్రమె ముందుగానే ఐటెం సాంగ్ చేస్తున్న నటి శీరత్ కపూర్ అని తెలిసిపోయింది. అల్లు అర్జున్ తో హాగ్ చేసుకున్న శీరత్ కపూర్ సోషల్ మీడియాలో ఫోటో పెట్టి ఆనందాన్ని తెలిపింది. నృత్యకారులకు ఎగరడానికి రెక్కలు అవసరం లేదు! వారి శక్తులు దారితీస్తాయి. తెలిసిన వారు. తెలుసు.. అంటూ కాప్షన్ కూడా పోస్ట్ చేసింది. 
 
కానీ బుధవారం, శీరత్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలను తీసుకొని ఒక ప్రకటన విడుదల చేసింది. తాను ఇటీవల తన ‘ప్రియమైన స్నేహితుడు’ అల్లు అర్జున్‌ను కలిసినప్పటికీ, తాను పుష్ప 2లో భాగం కానని ఆమె తెలిపింది.  పుకార్లు వ్యాప్తి చేయవద్దని కపూర్ ప్రతి ఒక్కరినీ కోరింది.
 
నేను ఇటీవల నా ప్రియమైన స్నేహితుడు అల్లు అర్జున్‌ని కలుసుకున్న మాట నిజమే అయినప్పటికీ, ఇది కేవలం ఒక ఆహ్లాదకరమైన ఫోటో తీసుకున్నాము. ఈ సినిమాలో నేను న‌టించ‌లేదు, ఇందులో ఐటెం సాంగ్ చేయ‌డం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరినీ నేను అభ్యర్థిస్తున్నాను. అని తెలిపింది. మరి ఈరకంగా తానూ పుబ్లిసిటీ చేసుకుంటుందా.. లేదా.. సుకుమార్ మందలించాడా .. అనేది తెలియాల్సి ఉంది.