గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 8 మే 2023 (12:01 IST)

మెగా అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న నీహారిక !

Neeharika
Neeharika
నాగబాబు కుమార్తె నీహారిక ఇటీవలే హాట్‌ టాపిక్‌గా మారింది. వ్యక్తిగత జీవితంలో ఏదో జరిగిందనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. నీహారికకు నటన అంటే ఇష్టం. మొదట టీవీ షో ఢీ జూనియర్స్‌కు యాంకర్‌గా చేసింది. అటుపిమ్మట ముద్దపప్పు ఆవకాయ్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఆ తర్వాత సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్‌, ఒక మనసు అనే సినిమాల్లోనూ నటించింది. ఆ తర్వాత వివాహం అయ్యాక నటనకు దూరంగా వుంది.
 
ఇక ఇప్పుడు వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తూ జీ స్టూడియోలో పలు కార్యక్రమాలు చేపడుతోంది. తాజాగా నీహారిక సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్‌ నటిస్తున్న పుష్ప2లో ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అందులో గిరిజన అమ్మాయిగా నటించనుందని సమాచారం. అదే గనుక నిజమయితే మెగా అభిమానులకు సందడే సందడి. త్వరలో దీనిపై క్లారిటీ రాగలదని అభిమానులు ఆశిస్తున్నారు.