నా మనసుకి ఎంతో దగ్గరైన ‘శ్రీదేవి శోభన్‌బాబు సినిమా : నిర్మాత సుస్మిత కొణిదెల
Sushmita Konidela, Santhosh Shobhan, Gauri G. Kishan, Vishnu Prasad
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం శ్రీదేవి శోభన్‌బాబు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ శ్రీదేవి శోభన్‌బాబు నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్‌ని అనుకోకుండా ఓ కాఫీ షాప్‌లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్‌లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ పాత్రను అద్భుతంగా చేశాడు. గౌరికి తెలుగు రాకపోయినా నాతో కూర్చుని తమిళంలో అర్థం తెలుసుకుని దాన్ని తెలుగులో నేర్చుకుని మరీ నటించింది. ప్రశాంత్ బలం.. నెటివిటీ. మన ఇంట్లో మనం ఎలా బిహేవ్ చేస్తామో దాన్ని చక్కగా క్యారీ చేస్తాడు. అదే ఈ సినిమాలోనూ చేశాడు. తను ప్రాణం పెట్టి.. చక్కటి ఎమోషన్స్‌తో సినిమాను పూర్తి చేశాడు. బాషా, మొయిన్ వంటి యంగ్ టాలెంట్‌తో నే కాదు.. నాగబాబుగారు, రోహిణిగారి వంటి సీనియర్స్ కూడా సినిమాలో నటించారు. గోల్డ్ బాక్స్ బ్యానర్ ముందు నేనున్నప్పటికీ నా వెనుక మావారు విష్ణు, మా కో ప్రొడ్యూసర్ శరణ్య సపోర్ట్‌గా నిలిచారు. ఫిబ్రవరి 18న మీ దగ్గరున్న థియేటర్స్‌లో శ్రీదేవి శోభన్‌బాబు సినిమా వస్తుంది. రేపు (సోమవారం ) ఓ పాటను రిలీజ్ చేస్తున్నాం. కమ్రాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు అన్నారు.
నిర్మాత విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18న శ్రీదేవి శోభన్‌బాబు మూవీ రిలీజ్ అవుతుంది. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్. ఆడియెన్స్ సరదాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు.
సంతోష్ శోభన్ మాట్లాడుతూ అవకాశం ఎప్పుడూ గొప్పదే. నన్ను, ప్రశాంత్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన సుస్మిత అక్క, విష్ణుగారికి థాంక్స్. 1970 నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రపంచానికి ఓ ట్రిబ్యూట్‌లాంటి సినిమాగా శ్రీదేవి శోభన్‌బాబు ఉంటుంది. సరదాగా ఉంటుంది. ఆడియెన్స్‌కు ఓ బ్యూటీఫుల్ ఎక్స్‌పీరియెన్స్ అవుతుంది. ఫిబ్రవరి 18న థియేటర్స్‌లోకి వస్తున్నాం. రేపు ఓ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నాం. నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ చక్కగా వర్క్ చేయటంతో మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నాం అన్నారు.
దర్శకుడు ప్రశాంత్ కుమార్ దిమ్మల మాట్లాడుతూ శ్రీదేవి శోభన్బాబుసినిమాను సరదాగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న పనుల్లో అందరూ బిజీగా ఉంటున్నారు. అందరూ కలుసుకోలేకపోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటే బావుంటుందనే ఆలోచన అందరిలోనూ వస్తుంది. సరదాగా ఎంజాయ్ చేసే సరదా సినిమా శ్రీదేవి శోభన్‌బాబు. సుస్మితగారు చక్కటి పల్లెటూరి అందమైన కథతో సినిమా చేయాలని నాతో అన్నారు. నేను శ్రీదేవి శోభన్‌బాబు కథ చెప్పగానే వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాను చూస్తున్నంత సేపు మన చుట్టూ చూసే పాత్రలే గుర్తుకు వస్తాయి. అంత నేచురల్‌గా ఉంటాయి. విష్ణుగారు చాలా సైలెంట్‌గా ఉంటారు. అందుకని ఆయన్ని చూస్తే కాస్త భయంగా ఉంటుంది. హీరో సంతోష్ శోభన్‌ను ఈ సినిమా తర్వాత శోభన్‌బాబు అని పిలుస్తారు. తను అద్భుతంగా చేశాడు. శ్రీదేవి పాత్రలో గౌరి చక్కటి ఎమోషన్స్‌ను క్యారీ చేసింది. అలాగే శరణ్యగారికి థాంక్స్. ఫిబ్రవరి 18న వస్తున్న శ్రీదేవి శోభన్‌బాబు కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు.