గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (11:07 IST)

ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు? మెగాబ్రదర్ ప్రశ్న

nagababu
ఆర్ఆర్ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్‌పై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 
 
తమ్మారెడ్డి పేరు ప్రస్తావించకుండానే నాగబాబు... ఆస్కార్‌ కోసం రూ.80 కోట్లు ఖర్చుపెట్టింది ఎవరు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
 
తమ్మారెడ్డి భరద్వాజ పేరును నాగబాబు నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. తమ్మారెడ్డి ఆరోపణలపై సూటిగా స్పందించినట్లు పలువురు భావిస్తున్నారు. 
 
నాగబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ RRR చిత్రంపై కొన్ని వివాదాస్పద ఆరోపణలు చేశారు. 
 
RRR చిత్ర యూనిట్ ఆస్కార్ ప్రచారానికి 80 కోట్లు ఖర్చు చేసిందని, ఇది డబ్బు వృధా అన్నట్లు తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.