గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (19:23 IST)

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసిన మహిళ.. వీడియో వైరల్

Scooty
Scooty
హైదరాబాద్‌లో రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకాశవాణి సెంటర్‌ ఎదురుగా ఉన్న అసెంబ్లీ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియోలో, మహిళ తన పనిలో నిమగ్నమై ఉన్నట్లు చూడవచ్చు. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
 
ట్రాఫిక్‌లో వుండగా మహిళ అలా ల్యాప్ టాప్‌లో పనిచేస్తున్న తతంతగాన్ని బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరించి ఇంటర్నెట్‌లో షేర్ చేయగా, అది వైరల్ అయ్యింది. ఆ మహిళ అంకితభావం, పనితీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.