శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మే 2023 (09:23 IST)

ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన మహిళ.. కిందపడి మృతి

woman
ప్రైవేట్ బైక్ ట్యాక్సీలో ప్రయాణించిన ఓ మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన సేవిక (39) అనే మహిళ పుట్టినరోజు సందర్భంగా బంధువుల ఇంటికి బైకు ట్యాక్సీలో బయల్దేరింది. అప్పుడు ఆయన ప్రయాణిస్తున్న బైక్ టాక్సీ అకస్మాత్తుగా లారీని ఢీకొని ప్రమాదానికి గురైంది.
 
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలకు గురైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ రైడర్ గాయాలతో బయటపడ్డాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. అనుమతి లేకుండా ప్రైవేట్ బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నందున, వెంటనే ప్రైవేట్ బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలనే డిమాండ్ వుంది.