ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (09:56 IST)

మహిళలకు శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ - ఆ టిక్కెట్ ధర తగ్గింపు

tsrtc
మహిళలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ టిక్కెట్ ధర రూ.90గా ఉంది. దీన్ని ఇక నుంచి పది రూపాయలు తగ్గించి రూ.80కే విక్రయించాలని నిర్ణయించింది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు రూ.10 తగ్గింపుతో అందజేస్తున్నారు. 
 
ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సామాజిక అనుసంధాన వేదిక ద్వారా వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సులో ప్రయాణించే మహిళలకు ఇకపై టీ24 టిక్కెట్‌ను రూ.80కే విక్రయిస్తారని, ఈ తగ్గింపు టిక్కెట్లు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.